![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -262 లో.. కళ్యాణ్ వెంట ప్రేమ కర్ర పట్టుకొని పరిగెడుతున్నది పేపర్ లో వస్తుంది. ఆ పేపర్ తీసుకొని వచ్చి శ్రీవల్లి రామరాజుకి చూపిస్తుంది. ఏంటి ఇది అని రామరాజు అడుగుతాడు. వాడు దొంగ మావయ్య.. చేతిలో బ్యాగ్ పట్టుకొని పారిపోతుంటే పట్టుకున్నానని ప్రేమ కవర్ చేస్తుంది. అలాంటి విషయలు ఇంటికి వచ్చి మావయ్య గారితో చెప్పాలి కదా అని శ్రీవల్లి అంటుంది. అది చిన్న విషయం కదా అని చెప్పలేదని ప్రేమ అంటుంది.
ఏంటి శ్రీవల్లి.. నువ్వు ప్రతీ చిన్న విషయానికి ఇలా రాద్దాంతం చేస్తావని శ్రీవల్లిని వేదవతి అంటుంది. ఏంటి చిన్న విషయం బుజ్జమ్మ.. ఒకవేళ ప్రేమకి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి.. ప్రతీచిన్న విషయం కూడా చెప్పాలని ప్రేమతో రామరాజు అంటాడు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి శ్రీవల్లి వెళ్లి ప్రేమకి ఈ బొకే వచ్చింది.. అప్పటి నుండి టెన్షన్ పడుతుందని చెప్తుంది. దానిపై వన్ వీక్ అని ఉంది.. అది చూసి ధీరజ్ ఆలోచనలో పడతాడు
వెంటనే రూమ్ కి వెళ్లి ఆ రోజు వచ్చిన కొరియర్ పై కూడా అడ్రెస్ లేదు.. ఆ కొరియర్ లో ఏముందో కనుక్కోవాలని కొరియర్ కోసం వెతుకుతాడు. అప్పుడే ప్రేమ వస్తుంది. ఎందుకు అలా వెతుకుతున్నావని ప్రేమ అడుగుతుంది. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావో ఆ కొరియర్ చూస్తే తెలుస్తుంది కదా అందుకే అని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత చందు దగ్గరికి శ్రీవల్లి వెళ్లి మాట్లాడుతుంది. నువ్వు నాతో మాట్లాడకు.. మీ వాళ్ళు చేసింది నేను మర్చిపోలేనని శ్రీవల్లిని చందు దూరం పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |